Negligence of Officials : హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యం

TRINETHRAM NEWS

– రాజీవ్ చౌరస్తాలో ఒకవైపుకు ఒరిగి ప్రమాదకరంగా వున్న టెలిఫోన్ పోల్ .
దీనికి బాధ్యులెవరు? అధికారులదా? లేక సిబ్బంది నిర్లక్ష్యమా?
– డిండి పట్టణ ప్రజలు.
డిండి (గుండ్లపల్లి) అక్టోబ ర్ 10 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో రాజీవచౌక్ వద్ద డివైడర్ మధ్యన ఉన్న టెలిఫోన్ స్తంభం ఒకవైపు ఒరిగి రోడ్డు పైన పడే విధానంగా వుంది . ఇది ఎవరికీ పట్టనట్లు ఏమి ఎరగనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
ఈ మార్గం గుండా కొన్ని వందల వాహనాలు రోజు ప్రయాణం చేస్తుంటాయి. అయినా అధికారులకు ఏమి ఎరగనట్లు వ్యవహరిస్తున్నారని,ఏదైనా ప్రమాదాలు జరిగితే దీనికి భాధ్యులు ఎవరని ? ప్రజలు అధికారులనుప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు,రోడ్డు సిబ్బంది స్పందించి స్థంభాన్ని తొలగించి ప్రమాదాలు జరగకుండా చూస్తారని డిండి పట్టణ ప్రజలు కోరుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Negligence of officials

You cannot copy content of this page

Scroll to Top