ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ డుంబ్రిగూడ ఏప్రిల్ 22: ఏప్రిల్ 21: డుంబ్రిగూడ మండలం కించుమండ వద్ద గల సంపంగి వాగుకు పరిశిల వద్ద 4.40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన సంపంగి వాగు బ్రిడ్జ్ ను రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ, కించుమండ గ్రామ౦ తో పాటు మరో 16 గ్రామాలకు చెందిన సుమారు 3,500 మంది జనాభాకు రహదారి కష్టాలకు చెక్ పెట్టడం జరిగిందని తెలిపారు ఎస్ సి ఎ 2022-23 కింద చేపట్టిన ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కేవలం 15 నెలలలోనే పూర్తీ చేసి 17 గ్రామాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఇంజినీరింగ్ అధికారులను మంత్రి అభినందించారు. ఆ రహదారి ప్రధాన రహదారి ఐన ఎన్ హెచ్ కు అనుసంధానం అయి ఉన్నదున ఆయా గ్రామాలు అభివృద్ధి దిశగా కీలకమైన అడుగు వేసినట్టు మంత్రివర్యులు పేర్కొన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ . జేసి, ఐటిడిఎ ఇంచార్జ్ పిఒ డా. ఎం జే అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, ఇంజినీర్ ఇన్ చీప్ ఎస్. శ్రీనివాసరావు, జిసిసి, ఆర్టిసి చైర్మన్లు కె. శ్రావణ్ కుమార్, దొన్నుదొర, మాజీ శాసన సభ్యులు గిడ్డి ఈశ్వరి, ఇ.ఇ వేణుగోపాల్, ఎ.ఇ ద్రువకుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్ధులు, కళాశాల భోధన, భోధనేతర సిబ్బంది మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, ధింషా నృత్యంతో స్వాగతం పలికి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


