Ravindra Kumar : నియోజక వర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు ,మాజి శాసన సభ్యులు రవీంద్ర కుమార్.

దేవరకొండ సెప్టెంబర్ 29 త్రినేత్రం న్యూస్. తెలంగాణ పూల పండుగ బతుకమ్మ వేడుకల ముగింపు రోజు “సద్దుల బతుకమ్మ”ను పురస్కరించుకొని దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….తెలంగాణ ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని ఆయన తెలిపారు.దేవీదేవతలను అర్చించే పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవడం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను, కృతజ్ఞతా భావనను తెలియజేస్తుందని అన్నారు.సబ్బండ వర్గాలు సమిష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని తెలిపారు.బతుకమ్మల నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలతో పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Saddula Bathukamma greetings

You cannot copy content of this page

Scroll to Top