గుంటకండ్ల జగదీష్ రెడ్డి రమావత్ రవీంద్ర కుమార్.
Trinethram News : దేవరకొండ (చింత పల్లి) సెప్టెంబర్23 ,త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి తల్లి కంకణాల ధశరథమ్మ ప్రథమ వర్థంతి సందర్భంగా ధశరథమ్మ విగ్రహాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి వారు పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..ధశరథమ్మ మృతి వారి కుటుంబానికి తీరనిలోటు అని వారు అన్నారు.వారి వెంట మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య,నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్,చింతపల్లి మాజీ జడ్పీటిసి కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి,మాజీ గ్రంథాలయ చైర్మన్ మల్లిఖార్జున్ రెడ్డి, కేతవత్ బిల్య నాయక్,వడత్య రమేష్ నాయక్ టీ వి ఎన్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, వెలుగురి వల్లపు రెడ్డి, దొంతం చంద్రశేఖర్ రెడ్డి,చింతపల్లి సుభాష్, పులిరాజ్ గౌడ్, వెంకటయ్య,ఆంజనేయులు,నిరంజన్, శిమర్ల శ్రీను తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


