Sardar Vallabhbhai Patel’s Jayanti : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదిన సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ ఐఏఎస్ ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ లు జండా ఊపి 2కె రన్ ను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.“రన్ ఫర్ యూనిటీ” వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి,జాతి ఐక్యతకు పునరంకితమై,మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారత దేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’గా జరుపుకోవడం మనందరి అదృష్టం. ఈ ‘రన్ ఫర్ యూనిటీ’ వంటి కార్యక్రమాలు దేశ ఐక్యత, సమగ్రత సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తాయి.స్వాతంత్ర్యం తరువాత, సర్దార్ పటేల్ ఎంతో దార్శనికత, సంకల్పంతో సుమారు 565 స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి, భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి వల్లే నేడు మనం సమైక్య భారతాన్ని చూడగలుగుతున్నాం.యువతరం ఆయన ఆశయాలను, దేశ సమగ్రత కోసం ఆయన పడిన తపనను స్ఫూర్తిగా తీసుకోవాలి. దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటూ, అన్ని ప్రాంతాల ప్రజలతో సమైక్యత, సోదరభావాన్ని పెంపొందించాలి అని తెలిపినారు.

ఇట్టి కార్యక్రమం లో జిల్లా ట్రైనీ కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి , జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్ ,డి‌టి‌సి డి‌ఎస్‌పి శ్రీనివాసులు , ఏ‌ఆర్ డి‌ఎస్‌పి వీరేష్ ,వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్ , ఆర్‌ఐ డేవిడ్ , ఎస్‌ఐ లు, ఆర్‌ఎస్‌ఐ లు , సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, యువతి యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sardar Vallabhbhai Patel's 150th birth anniversary

You cannot copy content of this page

Scroll to Top