వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: జీసెస్ ర్యాలీ లో ఘనంగా పాల్గొన్న సంఘాల ప్రతినిధులు
ఆనందోత్సవాల మధ్య ర్యాలీ నిర్వహణ ఉత్సాహంగా పాల్గొన్న యువకులు వికారాబాద్ లొ ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని క్రిస్టియన్స్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుడ్ ఫ్రైడే ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం నాడు ఉదయం 7:30 గంటలకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ హాజరై రన్ ఫర్ జీసస్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళిలు రక్షణ కోసం ఈ లోకంలో జన్మించారని, అందరిని సమానంగా చూడాలని, ప్రేమ కరుణ భావాలతో మెలగాలని, ప్రతి ఒక్కరు సేవా భావం కలిగి ఉండాలని చెప్పిన కరుణామయుడు అన్నారు, రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన, రన్ ఫర్ జీసస్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సంఘాల పాస్టర్ల ప్రార్థనలతో ర్యాలీ ప్రారంభమైంది.రన్ ఫర్ జీసస్ ర్యాలీ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి దర్గా వరకు ప్రారంభమైన ర్యాలీలో వికారాబాద్ లో ఉన్న సంఘాల ప్రజలు రోడ్డుపై నడుచుకుంటూ, మోటార్ సైకిళ్లు, కార్లు మొదలగు వాహనాలపై వెళ్తూ జెండాలను ఊపుతూ ప్రభువైన ఏసుక్రీస్తు పునరుత్థానం సందేశాన్ని గుర్తు చేసుకుంటూ రన్ ఫర్ జీసస్ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఏసుక్రీస్తు ప్రభువు గొప్పతనాన్ని కొనియాడుతూ గీతాలాపనలు చేస్తూ ప్రభు జనన మరణ పునరుద్దానము గురించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది వరకు క్రైస్తవ బిడ్డలు హాజరై ప్రభువును కీర్తిస్తూ ఘనపరిచారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


