ఔట్సోర్సింగ్ డ్రైవర్లకు హెల్త్ కార్డులు, బస్ పాసులు మంజూరు చేయాలి
Trinethram News : కాకినాడ,డిసెంబర్,24: కాకినాడ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ డ్రైవర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం కాకినాడలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏపీ పిటిటిడిఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఐ .రవి అధ్యక్షతన బుధవారం ఉదయం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏపీ పిటీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి సత్యానందం, రాష్ట్ర నాయకులు జార్జి బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ కార్మికులకు బస్సు పాసులు మంజూరు చేయాలని, వారికి హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు మంజూరు చేసి వారిని పర్మినెంట్ చేయాలని వారన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో పని చేయాలంటే 10,000 మంది అదనపు సిబ్బందిని నియమించాలని అప్పుడే ప్రజలకు ప్రమాణా సౌకర్యం సులభం అవుతుందని, ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని వారన్నారు. ఈ సమావేశం అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది.
ఆర్టీసీ ఔట్సోర్సింగ్ డ్రైవర్స్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా తోకల ప్రసాద్, అధ్యక్షులుగా వినోద్, వైస్ ప్రెసిడెంట్: ఎన్ శీను బాబు, సెక్రటరీ: ఎం డి మోహిద్దీన్, జాయింట్ సెక్రెటరీ: వి వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ: కే ఎస్ పి రావు, క్యాషియర్, దత్తు, పబ్లిసిటీ సెక్రటరీ: బి యు కృష్ణ, వై ప్రసాద్, మెంబర్స్ ఎన్ ఆర్ కృష్ణ, జీవి రావు, విఎస్ఎల్ కుమార్, విజిఎన్ కుమార్, ఎం రాజేష్ ఎం రాజేష్ నూతన కమిటీగా ఎన్నుకోవడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


