Minister Kandula Durgesh : శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం

TRINETHRAM NEWS

జగతికి శాంతి సందేశమిచ్చిన మహానుభావుడు ఏసు ప్రభువు

క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

అమరావతి / నిడదవోలు: క్రైస్తవ సోదరులకు మంత్రి కందుల దుర్గేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణకు ప్రతీకగా నిలిచిన ఏసు ప్రభువు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచమానవాళికి శాంతియుతమైన, ప్రేమపూర్వకమైన జీవనమార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త ఏసు ప్రభువు అన్నారు.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే పదాలను ఉదహరిస్తూ దుష్టులను శిక్షించాలని, శిష్టులను రక్షించాలని అంటారు కానీ తనను హింసించి శిలువ వేసిన దుష్టులను సైతం కాపాడమని చెప్పిన మహానుభావుడు ఏసుప్రభువు అని మంత్రి దుర్గేష్ అన్నారు. ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడితేనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీ లకు అండగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

జారీ చేసిన వారు: పీఆర్ఓ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Let's work towards establishing a peaceful society

You cannot copy content of this page

Scroll to Top