Dussehra Bonus : ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి, సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది,దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది,డ్రైవర్లతో పాటు కండక్టర్లు, సూపర్ వైజర్లు, శ్రామిక్‌లకు ఇవ్వనున్నారు. వారి నెల జీతం ఆధారంగా అడ్వాన్స్‌ అందనుంది.ఈ అడ్వాన్స్‌ను తిరిగి వారి వేతనం నుంచి నెలకు కొంత చొప్పున యాజమాన్యం కట్ చేయనుంది,ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధి కారులతో భేటీ అయి నిర్ణయం తీసుకున్నారు.
అడ్వాన్స్‌ను ఉద్యోగులకు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు సజ్జనార్‌ సూచించారు.కాగా, దసరా పండగ నేపథ్యంలో ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం కొన్ని రోజులుగా యాజమాన్యాన్ని కోరుతోంది. టీజీఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు.తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేసేందుకు తోడ్పాటు అంది స్తున్నామని చెప్పగా..ఆర్టీసీ ఉద్యోగుల కోరిక మేరకు అడ్వాన్స్‌ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

RTC employees get Dussehra bonus

You cannot copy content of this page

Scroll to Top