Amaravati News : రాజధాని గ్రామాలకు రూపాయలు తొమ్మిది వందల నాలుగు కోట్లు విడుదల

TRINETHRAM NEWS

తేదీ : 23/11/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు , ఆధునిక ,మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తాగునీటి సరఫరా, ముంపు సమస్యల పరిష్కారం, సిసి రోడ్లు, వీధి దీపాలు, భూగర్భ మురికి నీటి వ్యవస్థ వంటి పనులకు రెండు వేల ఇరవై ఆరు, జనవరి నుంచి పనులు చేపట్టనున్నారు.
ఇందుకుగాను ప్రభుత్వం రూపాయలు తొమ్మిది వందల నాలుగు కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ నిధుల ద్వారా రాజధానితోపాటు గ్రామాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rs. 904 crore released for capital villages

You cannot copy content of this page

Scroll to Top