నవంబర్ 10, 2026
TRINETHRAM NEWS
Rongala Anusha

Rongala Anusha : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 18 ; చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున రొంగలా అనూష నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఈ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చింతలపూడి డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. వీళ్ళతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్ర శేషు, పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, టీడీపీ నాయకులు దాకారపు కృష్ణ, షేక్ ముస్తఫా, జనసేన పార్టీ నుండి మాజీ జడ్పీటీసీ పోల్నాటి బాబ్జి బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొని నామినేషన్ ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి రొంగలా అనూష మాట్లాడుతూ తనను గెలిపిస్తే జంగారెడ్డిగూడెం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

“కొత్తగా పెళ్లయిన జంటలకి లేదా యానివర్సరీ జరుపుకునే వారికి బెస్ట్ గిఫ్ట్! BEHOMA గోల్డ్ మెటల్ హంసల జంట షోపీస్—ఫెంగ్ షుయ్ ప్రకారం ఇది ప్రేమకు, అదృష్టానికి ప్రతీక. ప్రీమియం గిఫ్ట్ బాక్స్‌తో వచ్చే ఈ బ్యూటిఫుల్ ఓటివ్ హోల్డర్‌ని ఇప్పుడే డిస్కౌంట్ ధరలో కొనుగోలు చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.”

You cannot copy content of this page