
Coalition Government : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ 11: జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో ఉన్నటువంటి ఉండి నియోజకవర్గం, మండలం లో గల గ్రామం పాములపర్రు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట శ్రీరాములు అదేవిధంగా ఉపాధ్యక్షులు నక్క వెంకప్ప మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం, భాష , పార్టీ బేధం లేకుండా సూపర్ సిక్స్ పథకాలు అందాయని అన్నారు.
ఆ పంచాయతీలో ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారో తెలిపారు. వీధి దీపాలు, డ్రైనేజీ, సిసి రోడ్లు, నీటి సౌకర్యం, మొదలైనవి బాగానే ఉన్నాయని వివరణ అందించారు. నిరుపేదలకు ఇళ్ళు, కొత్త పెన్షన్లు గురించి సంబంధిత అడుగుతున్నారని పేర్కొన్నారు. ఎప్పుడు జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి తిరుగు లేదని ప్రజలు అంటున్నారని సూచించారు.
పి – నాలుగు, ఇంటి పన్ను, జన గణన ఎంత శాతం పూర్తి అయ్యిందో వెల్లడించారు. మే నెల ఇరవై ఏడు,ఇరువై ఎనిమిది మండలంలో జరిగిన మహానాడు గురించి చెప్పారు. . ఒక పండుగలా జరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా టిఫిన్స్, మంచినీరు, భోజనాలు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పించారని, చెప్పడం జరిగింది. శాసనసభ్యులు , డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక కార్యకర్తల పని చేస్తున్నారని వెల్లడించారు. అయితే ఆక్వా కల్చరల్ రైతులకు కచ్చితంగా సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe