సింగరేణి లో సులబ్ కాంప్లెక్స్ లలో పని చేస్తున్న సఫాయి కార్మికుల కు సవరించిన వేతనాలను చెల్లించాలి.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వేతనాలు సవరించి జారీ చేసిన ఉత్తర్వులను కాంట్రాక్టర్ అమలు చేయాలి.
రోజుకు రూ.631.85 పై. ఇవ్వాల్సి ఉండగా రూ.510/- చెల్లిస్తున్నారు.
ఆర్థిక దోపిడీ కి గురవుతున్న కాంట్రాక్టు కార్మికులు.
ఏఐటియుసి ఆర్జీ వన్ అధ్యక్షులు ఎం.ఎ.గౌస్.
సింగరేణి లో సులభ్ కాంప్లెక్స్ లలో పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల కు యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సవరించిన వేతనాలను కాంట్రాక్టర్ చెల్లించే విధంగా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆర్జీ వన్ అధ్యక్షులు ఎం.ఎ.గౌస్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. సింగరేణి లో పని చేస్తున్న సఫాయి కార్మికుల కు యాజమాన్యం అక్టోబర్ 2024 నుంచి ప్రభుత్వ జీ.ఓ. నెంబర్ 108 ననుసరించి వేతనాలు సవరించిందని, దీని ప్రకారం జోన్ వన్ లో ఉన్న రామగుండం రీజియన్ లో పని చేస్తున్న వారికి రూ.631.85 పై చెల్లించేందుకు యాజమాన్యం అక్టోబర్ లో ఉత్తర్వులు జారీ చేసిందని, కాని దీని ప్రకారం కాంట్రాక్టర్ లు చెల్లించడం లేదని 510/- రూపాయలు చెల్లించి ఆర్థిక దోపిడీ కి గురవుతున్నారని ఆయన తెలిపారు. కనుక యాజమాన్యం స్పందించి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సులభ్ కాంప్లెక్స్ లలో పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల కు సవరించిన వేతనాలను చెల్లించాలని, అదేవిధంగా పెరిగిన బకాయి వేతనాలు చెల్లించాలని, ఇట్టి ఉత్తర్వులను కాంట్రాక్టర్ అమలు చేసే విధంగా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App