Blood Donation Camp : కురిడి గ్రామంలో “సన్ గ్రీన్” ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ డుంబ్రిగూడ ఏప్రిల్ 22: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగుడ మండలానికి చెందిన కురిడి గ్రామంలో, ప్రముఖ స్వచ్ఛంద సంస్థ “సన్ గ్రీన్” ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ఈ గ్రామాన్ని సందర్శించిన నేపథ్యంలో, గ్రామ ప్రజలలో పెరిగిన చైతన్యంతో ఈ శిబిరం విజయవంతంగా సాగింది.
రోటరీ క్లబ్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 30 మంది రక్తదాతలు పాల్గొని తమ విలువైన రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా సన్ గ్రీన్ సమస్త ఫౌండర్ మరియు డైరెక్టర్ డాక్టర్ కె. శృతి మీడియాతో మాట్లాడుతూ, “రక్తదానం జీవాలను రక్షించే పవిత్రమైన చర్య. మా సంస్థ ఈ ప్రాంతాలలో ఆరోగ్య సేవల ప్రాధాన్యతను పెంచే దిశగా కృషి చేస్తోంది” అని తెలిపారు.
డాక్టర్ శృతి వివరించగా, 2014లో బొబ్బిలి వాస్తవ్యులైన కర్రి సూర్యనారాయణ పేరుతో “సన్ గ్రీన్” సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రారంభించినప్పటి నుంచి మైదాన ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాలలోనూ పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని ఆమె వివరించారు.
తాను హార్టికల్చర్ ఆఫీసర్ గా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన అనంతరం, వ్యవసాయం, ఆర్గానిక్ పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో మరియు గిరిజన ప్రాంతాల్లో పూతోటల అభివృద్ధిలో ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు డాక్టర్ శృతి చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పచ్చదనం పెంచడం, గ్రామీణ ఆర్థికాభివృద్ధిని గమనిస్తూ అనేక చర్యలు చేపడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ప్రపంచ మానవ హక్కుల రక్షణ సంస్థలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ కె. శృతి విధులు నిర్వహిస్తున్నారు. ఈ భాద్యతల్లో భాగంగా తరచూ మన్నె ప్రాంతాల్లో పర్యటిస్తూ గిరిజన సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. రక్తదాన శిబిరం వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యపరమైన అవగాహన పెంచే ప్రయత్నాలు కూడా ఆమె చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమాన్ని కురిడి గ్రామస్థులు, యువత, వైద్య సిబ్బంది అధిక సంఖ్యలో హర్షాతిరేకాలతో స్వీకరించారు. రక్తదాన శిబిరం విజయవంతం కావడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువచ్చేలా “సన్ గ్రీన్” సంస్థకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Blood donation camp organized

You cannot copy content of this page

Scroll to Top