MP Purandeshwari : 2.10 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన

TRINETHRAM NEWS

2.10 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగిపోతున్న కూటమి ప్రభుత్వం…

ఎంపీ పురందేశ్వరి…
ఎమ్మెల్యే గోరంట్ల

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగిపోతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఈరోజు కొంతమూరు పంచాయితీ కొంతమూరు, కోలమూరు, రాయుడుపాకల ప్రాంతాలలో 2.10 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసిన అనేక సి.సి రోడ్లను మరియు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్య అతిథిగా పాల్గొని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయి పల్లె ప్రాంతాలు కుంటి పడిపోవడం మనమందరం చూసామని, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ఈరోజు కొంతమూరు గ్రామంలో జరిగే ప్రారంభోత్సవాలే నిదర్శనమని, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో గ్రామాలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అనేక పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ఈరోజు 2.10 కోట్ల రూపాయలతో నూతన నిర్మాణం చేసిన అనేక సీసీ రోడ్లను ప్రారంభించామని తెలిపారు. గ్రామంలో ప్రధాన సమస్య మెయిన్ డ్రైనేజీ నిర్మించాల్సి ఉందని జంగాలపల్లి కాలనీ నుండి మెయిన్ రోడ్డు వరకు ఆక్రమణలు తొలగించి 2 కోట్ల రూపాయలతో మెయిన్ డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే 3.82 కోట్ల రూపాయలతో అనేక సీ.సీ రోడ్లు, డ్రైన్లు నిర్మించేందుకు, ప్రతిపాదనలు సిద్ధం చేశామని త్వరలోనే పనులు మొదలు పెడతామని అన్నారు. కొంతమూరు ప్రాంతమంతా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

అనంతరం రేపు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి వారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సీ చైర్మన్ మార్ని వాసుదేవ్, మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, జిల్లా బిజెపి అధ్యక్షులు పి.నాగేంద్ర, దండమూడి ప్రసాద్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కురుకూరి కిషోర్, నారాయణ గౌడ్, ఆకుల శ్రీధర్, పి.ఆర్ డి.ఈ రవి, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, దండమూడి ప్రమీల, తాడేపల్లి నాగరాజు, వడ్డీ రామకృష్ణ, యానాపు యేసు, శివ, గోకా శ్రీను, బత్తిన రత్న రాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Inaugurating the development works

You cannot copy content of this page

Scroll to Top