Indiramma’s House : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై సమీక్షా సమావేశం

TRINETHRAM NEWS

పేదల సొంతింటి కల నెరవేర్చే బాధ్యత దొరకడం నా అదృష్టం.
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ జూన్ 12 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై దేవరకొండ నియోజక వర్గ ఎంపీడీఓలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తొలి విడతలో ఎంపికైన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలు ఇప్పటికే అందజేయడం జరిగింది అని అన్నారు.

తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లను పేదవాళ్లలో బహుపేదవాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. మిగతా రెండు, మూడు, నాలుగు విడతలలో కూడా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం. లబ్దిదారుల కళ్లల్లో ఆనందం,పేదల కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదనే సాక్ష్యం. దేవరకొండలోని గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే సరికొత్త పథకానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు అని పేర్కొన్నారు.

భూ యాజమాన్యపు హక్కులు కల్పించే “ఇందిర సౌర గిరి జల వికాసం”పథకం కింద నియోజక వర్గంలో 93 మందికి మంజూరు. ప్రతి రైతుకు సోలార్ పంపుసెట్టు ఇవ్వడం ద్వారా విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి “ఇందిర సౌర గిరి జల వికాసం” తీసుకోవచ్చాం అని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో హౌసింగ్ DE నాగేందర్ గౌడ్,DTDO ఛత్రు నాయక్,మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి,ఎంపీడీఓలు,AE లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Review meeting on Indiramma's

You cannot copy content of this page

Scroll to Top