Egg Biryani : అంగన్వాడీ కేంద్రాల్లో సమతుల్య ఆహారంలో భాగంగా ఎగ్ బిర్యాని

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జూన్ 11 త్రినేత్రం న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా, అంగన్వాడి కేంద్రాల్లో ఇకనుంచి వారానికి ఒకరోజు ఎగ్ బిర్యాని అందజేస్తామని డిండి సెక్టార్ సూపర్వైజర్ రేణుక రెడ్డి తెలిపారు. మూడు సంవత్సరముల నుండి ఆరు సంవత్సరముల వరకు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ,అంగన్వాడీ కేంద్రాలలో ఒక పూట సంపూర్ణ భోజనం అందించే విధానంలో భాగంగా ,ఎగ్ బిర్యానీ అందిస్తారని ఆమె తెలిపారు. చిన్నపిల్లల కు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పోషకార లోపం నివారించడం కోసం, సమతుల్య ఆహారంలో భాగంగా ఎగ్ బిర్యానీని అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు.

3 నుండి 6 సంవత్సరముల లోపు చిన్నారులకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ,పూర్వ ప్రాథమిక విద్యను, అంగన్వాడీ కేంద్రాలలో అందించడం జరుగుతుందని, ఉచిత పుస్తకాలను, ఉచిత యూనిఫాంసును, ఉచిత ఆట వస్తువులను, అందించి ఆటపాటల ద్వారా విద్యను అందిస్తారని ,తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిండి మండల కేంద్రంలోని నాలుగు అంగన్వాడి కేంద్రాల్లో బుధవారం ఎగ్ బిర్యానీ భోజన కార్యక్రమాన్ని సూపర్వైజర్ రేణుక రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మంగమ్మ ,సత్యవాణి, చంద్రకళ, లావణ్య, ఆయాలు చక్రి ,పార్వతమ్మ ,నాగమణి, సైదమ్మ ,చిన్నారి బాలబాలికలు ,తల్లులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Egg Biryani as part

You cannot copy content of this page

Scroll to Top