జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. పెనుమురు. గుండెపోటుతో విశ్రాంత ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని అట్లవారిపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు టి.గురుస్వామి(85) గుండెపోటుతో సోమవారం నారాయణ హాస్పిటల్ లో మృతి చెందారు.గత వారం రోజుల క్రితం గురుస్వామి భార్య సిద్ధమ్మ కూడా అనారోగ్యంతో మృతి చెందారు.

ఈ క్రమంలో బుధవారం దివసాలును ఏర్పాటు చేయనున్నారు .అయితే భార్యను కోల్పోవడంతో తీవ్ర మనస్థాపానికి చెందిన గురుస్వామి తీవ్రంగా కలతచెంది గుండెపోటుతో మృతి చెందారు. దీంతో మండలంలో పలువురు ఉపాధ్యాయులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.స్వగ్రామంలో విశాధ ఛాయలు అలముకున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Retired teacher dies of heart attack

You cannot copy content of this page