
యూరియా కోసం రైతులు క్యూలైన్లో ..కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలో..
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
Restrictions on Urea : దేవరకొండ డివిజన్ జూన్ 21, త్రినేత్రం న్యూస్. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సరిగా సరఫరా చేయడం లేదనీ. ఇప్పుడు యూరియా విషయంలో కూడా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ మండిపడ్డారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు…..రైతులకు రెండు బస్తాల యూరియానే ఇస్తామని, అదీ యాప్ ద్వా రా మాత్రమే అందిస్తామని కొత్త ఆంక్షలు విధించడంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా సరఫరాలో రవాణా సమస్యలు తలెత్తినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సంబంధిత జీఎంలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేవారని ఆయన గుర్తు చేశారు.ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తగిన చర్యలు తీసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేవారు.బీఆర్ఎస్ పాలించిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఒక్క సీజన్‌లో కూడా యూరియా కోసం గానీ, ఇతర ఎరువుల కోసం గానీ రైతులు ఇబ్బంది పడలేదని పేర్కొన్నారు.
ఎరువుల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. రైతులకు సకాలంలో ఎరువులు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి 75 సార్లు వెళ్లారని చెబుతు న్నారని, అయితే రైతుల అవసరాల కోసం కేంద్రాన్ని ఎందుకు ఒప్పించ లేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు అవసరమైన యూరియాను వెంటనే అందించాలి. గతంలో అమలైన విధంగానే యూరియా సరఫరా వ్యవస్థను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe