Ramavat Ravindra Kumar : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి

TRINETHRAM NEWS

ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

డిండి (గుండ్ల పల్లి) ఫిబ్రవరి 23, త్రినేత్రం న్యూస్. డిండి మండలం దాసరినెమిలిపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 39వ బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ……ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి అని ఆయన అన్నారు.దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అయన తెలిపారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్ రావు,మాజీ వైస్ చైర్మన్ చింతపల్లి సుభాష్, స్థానిక సర్పంచ్ షేక్ రఫియాబషీర్, మాజి కో- అప్షన్ సభ్యులు జంగిర్, ఉప సర్పంచ్ రాం రెడ్డి,గంగిడి నరేందర్ రెడ్డి,బొడ్డుపల్లి కృష్ణ,లక్ష్మణ్,రామచంద్రం,బషీర్,శ్రీధర్, హనుమంత్, భగవంతు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Lakshmi Venkateswara Swamy should be blessed

You cannot copy content of this page

Scroll to Top