
Call for Applications : డిండి గుండ్ల పల్లి) జూన్ 21, త్రినేత్రం న్యూస్. గుండ్లపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 4 పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించిటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున అట్టి పాఠశాలలో తాత్కాలిక పద్దతిలో పనిచేయుటకు ఒక ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ మరియు ఒక ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి పగిడిపాటి నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
క్రింది పేర్కొనబడిన పాఠశాలల్లో మాత్రమే ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ మరియు ఒక ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము.
- ప్రాథమిక పాఠశాల – టి గౌరారం
- ప్రాథమిక పాఠశాల – కందుకూరు
- ప్రాథమికోన్నత పాఠశాల – ఖానాపూర్
- ప్రాథమికోన్నత పాఠశాల – ఎర్రారం అర్హతలు :
1) ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. బాల్య విద్య లేదా ప్రాథమిక బోధనలో అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
2) ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
నోట్ : అర్హత కు సంబందించిన సర్టిఫికెట్స్ తప్పకుండ జత చేయవలెను. వయస్సు :
అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేదీ నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్ సీ ఎస్ టీ , బీ సీ, ఈ డబ్ల్యూ ఎస్ వాళ్లకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు మరియు అంగవైకల్యం ఉన్నవారికి 10 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. గౌరవ వేతనం:
1) ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ కు నెలకు 8000 చొప్పున 10 నెలలకు గౌరవ వేతనం చెల్లిస్తారు.
2) ఆయా పోస్టుకు నెలకు 6000 చొప్పున 10 నెలలకు గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తులను మండల విద్యాధికారి కార్యాలయం – గుండ్లపల్లి నందు తేది: 22-06-2026 నుండి 26-06-2026 సాయంత్రం 4 గంటల వరకు సమర్పించవచ్చని తెలిపారు. ఎంపికలో స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన నిర్వహించబడతాయని పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe