Minister Nadendla Manohar : మారుమూల గిరిజన గ్రామాలకు మరింత రోడ్డు కనెక్టివిటీ కోరుతూ మంత్రి కి జనసేన నాయకులు వినతులు

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా (అనంతగిరి) త్రినేత్రం న్యూస్ ఆగస్టు 06 : అనంతగిరి మండలంలోని పలు మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి అనుసంధానాన్ని మెరుగుపర్చాలని గ్రామస్తులు జనసేన నాయకులు పౌరసఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి కోరారు ఇప్పటికే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పలు రహదారి పనులు ప్రారంభమయ్యాయి.
ఇటీవల ఎగువ శోభ పంచాయితీ మర్దగూడ అడ్వాన్స్ సర్ పార్క్ నుంచి జముగూడ, కమలపురం, పులగూడ, ఎగువ శోభ గ్రామాల వరకు 4 కిమీ మేర రహదారి మంజూరు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. గర్భిణీలు, వృద్ధులు, ఇతర గ్రామస్తులకు ప్రయాణ సౌలభ్యం కోసం ఇది అత్యవసరమని తెలిపారు.
అలాగే హెక్ట గుడ–ఎగువశోభ గ్రామాల మధ్య వర్షాకాలంలో పొంగిపొర్లే వాగుపై బ్రిడ్జ్ నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొండిభ పంచాయితీ సాడ గ్రామం నుంచి కొసామామిడి, కపటి వలస, రంజని వలస, బలియగూడ గ్రామాలకు 6 కిమీ రహదారి అవసరమని కోరారు.
పుట్టపాడు–బొడ్డపాడు మధ్య 3 కిమీ, వెంగడ పంచాయితీ డుంబ్రి వలస నుంచి గోమంగి, బంజోడ వరకు 10 కిమీ రహదారి, అలాగే ఎగువ శోభ నుంచి దిగువ శోభ, పోర్నపొదుర్, బిర్జిగూడ వరకు తహశీల్దార్ కార్యాలయాన్ని అనుసంధానించే రహదారిని మంజూరు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతిపత్రం జనసేన నాయకులు మరియు గ్రామస్తులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల అధ్యక్షుడు చిట్టం మురళి, అరకు నియోజకవర్గ ఇంచార్జి చెట్టి చిరంజీవి, డి. నవీన్ కుమార్, శ్రీనివాస్, కూర రమేష్, ప్రవీణ్ కుమార్, సాయి కుమార్, లక్ష్మణ్, రవి, సుబ్బారావు, రత్న ప్రియ, మోహన్, రామన్న, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena leaders petitioned the minister

You cannot copy content of this page

Scroll to Top