Request to MPDO : సంత గడువు పొడిగించాలని ఎం పి డీ ఓ కు వినతి

TRINETHRAM NEWS
Request to MPDO to extend the cattle fair

Request to MPDO : కొండ మల్లేపల్లి మార్చ్ 23, త్రినేత్రం న్యూస్. కొండమల్లెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించే పశువుల సంత టెండర్ వేలంపాట గడువును పెంచాలని కోరుతూ గ్రామ వార్డు సభ్యులు సోమవారం ఇన్చార్జి ఎం పి డీ ఓ సుధీర్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.
పాలక వర్గం తో చర్చించ కుండానే సర్పంచ్ , కార్యదర్శి ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరి కాదని ఆరోపించారు. సంత టెండర్ వేలంపాట తేదీని పొడిగించడంతో పాటు టెండర్ రుసుమును కూడా తగ్గించి అందరికీ అవకాశం కల్పించాలని వారు అధికారులను కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top