Sanitation Worker : పారిశుధ్య కార్మికునికి సన్మానం

TRINETHRAM NEWS
Sanitation worker honored

Sanitation Worker : డిండి (గుండ్లపల్లి) మార్చ్ 23, త్రినేత్రం న్యూస్. ఎర్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని కామదేను గౌరారం గ్రామ పారిశుధ్య కార్మికుడు కొండ్రపల్లి సైదులు నిత్యం గ్రామంలో ప్రజల అవసరాల కనుగుణంగా పారిశుధ్యం పనులు సక్రమంగా చేస్తూ, మంచి నీటి ట్యాంక్, సీసీ రోడ్లను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతూ గ్రామ పరిసరాలను పారిశుధ్య పనులు చేస్తూ ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా సేవలందిస్తున్నందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామ వార్డు సభ్యులు, జర్నలస్ట్ దర్శనం విష్ణు సోమవారం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నెపాక లాలయ్య,బంగారి సాయిలు,పట్ల చెన్నకేశవులు, శంకర్,నిరంజన్, జోగు ఆంజనేయులు, ముదిగొండ వెంకట్,పట్ల వెంకటరమణ,ఏడ్పుల శివ,వేణు, సిద్దు, కిరణ్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top