MPDO : ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ సక్రమంగా చేయండి. ఎంపీడీవో

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్,పెనుమూరు. శనివారం ఎంపీడీవో కార్యాలయం నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ బృందం మరియు ఉపాధి హామీ సిబ్బందితో కలిపి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసిన మండల అభివృద్ధి అధికారి.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నీలకంఠేశ్వర్ రెడ్డి తన కార్యాలయంలోమాట్లాడుతూ 2024,-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ కింద చేసిన పనులను తనిఖీ సిబ్బంది 15 రోజుల్లో ఆడిట్ నిర్వహిస్తారు కావున వాటికి సంబంధించిన రికార్డులను తనిఖీ సిబ్బందికి అందించవలసిందిగా ఎంపీడీవో ఉపాధి సిబ్బందికి తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామపంచాయతీలలో అందరు ప్రజాప్రతినిధులకు ముందస్తుగా తెలియజేయాలన్నారు. వారితో సమన్వయంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీ సిబ్బంది మొరార్జీ, డిఆర్పీలు కుమార్,లోకేష్ ఉపాధి హామీ ఏపీవో గుణశేఖర్ మరియు ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Do the social inspection of the employment guarantee scheme

You cannot copy content of this page

Scroll to Top