TRINETHRAM NEWS

Republic Day 2024: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

🔶వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్‌ హాజరుకానున్నట్లు సమాచారం.

🍥దిల్లీ: 2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron)ను ఆహ్వానించినట్లు కేంద్ర అధికారిక వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. అంతకుముందు ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)ను ఆహ్వానించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వెల్లడించారు. అయితే, వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేనని బైడెన్‌ చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

🌀ఈ ఏడాది జులైలో పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ బాస్టిల్‌ డే పరేడ్ (Bastille Day Parade)లో ప్రధాని మోదీ (PM Modi) ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబరులో భారత్‌ వేదికగా దిల్లీలో జరిగిన జీ20 సదస్సులో ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెక్రాన్‌ మాట్లాడుతూ.. భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీతో చర్చలు జరిగాయని తెలిపారు. బాస్టిల్‌ డే పరేడ్‌కు మోదీ హాజరుకావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావించారని పేర్కొన్నారు. గత ఏడాది గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌సీసీ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.