Secretariats Recruitment : సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ

TRINETHRAM NEWS

తేదీ : 21/08/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర కేంద్రమైన అమరావతి సచివాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గ్రామ ,వార్డు సచివాలయాల్లో రెండు వేల, ఏడు వందల, డెబ్బై ఎనిమిది డిప్యూటేషన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. అందులో భాగంగా ఒక వేయి , ఏడు వందల, ఎనభై ఐదు గ్రామ ,వార్డు సచివాలయాల్లో కొత్తగా తొమ్మిది వందల తొంబై మూడు కొత్త పోస్టులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది అని పేర్కొన్నారు. అదేవిధంగా చింతూరు సి హెచ్ సి ని వంద పడకల వైద్యశాలగా అప్ గ్రేడ్ చేసేందుకు అంగీకరించిందని తెలపడం జరిగింది. వీటితోపాటు నాలా పన్ను నాలుగు శాతంలో డెబ్బై శాతం స్థానిక సంస్థలకు , ముప్పై శాతం అథార్టీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Recruitment of posts in the Secretariats

You cannot copy content of this page

Scroll to Top