ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Reading news

సేవ్ నాంపల్లి క్యాంపస్ అంటూ పదో రోజు వినూత్నంగా నిరసన. 10వ రోజు ఉద్యమం ఉధృతం.

Reading News : కూకట్పల్లి జూలై 11, (త్రినేత్రం న్యూస్) : ప్రైవేటు వ్యక్తుల బారి నుంచి తెలుగు యూనివర్సిటీ నాంపల్లి క్యాంపస్ ను కాపాడుకునేందుకు విద్యార్థుల ప్రారంభించిన నిరసన పది రోజులు దాటిన ఉధృతి తగ్గలేదు. శనివారం రోజు సెలవు రోజు అయినప్పటికీ జర్నలిజం విభాగం విద్యార్థులు, భాషా శాస్త్ర, జ్యోతిష్యం విభాగం, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అధిక సంఖ్యలో దీక్షలో కూర్చున్నారు. సేవ్ నాంపల్లి క్యాంపస్ అంటూ నినాదాలు హోరెత్తించారు.

తెలుగు యూనివర్సిటీ జోలికి వస్తే ఖబర్దార్ హెచ్చరించారు. విద్యార్థులు గల మెత్తితే.. కబ్జాదారులే పారిపోరా అంటూ జర్నలిజం విద్యార్థులు పాటలు పాడుతూ, వార్తలు చదువుతూ, కవితల రూపంలోనూ తమ నిరసన తెలిపారు. స్టూడియో రూపంలో ఓ సెట్ ను అక్కడే వేసి ఆకట్టుకున్నారు. శనివారం రోజు ముఖ్యంశాలు అంటూ తెలుగు యూనివర్సిటీలో జరుగుతున్న ఉద్యమాలను తెలియజేశారు. సేవ్ నాంపల్లి క్యాంపస్ అంటూ నినదించారు.

ఈ సందర్భంగా సీనియర్ అధ్యాపకురాలు, తెలుగు వర్సిటీతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న డాక్టర్ షేక్ హసీనా మాట్లాడుతూ.తమ యూనివర్సిటీ కాపాడుకోవడానికి విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమానికి అందరూ మద్దతు పలకాలి అన్నారు. తెలుగు యూనివర్సిటీ సకల కళలకు, వినూత్న కోర్సులకు నిలయమని చెప్పారు. ఇటువంటి యూనివర్సిటీకి బాచుపల్లి, నాంపల్లి క్యాంపస్ లే కాదు.ఇంకో క్యాంపస్ ఏర్పాటు చేసినా తక్కువే అని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఆవేదనను ఆందోళనను అర్థం చేసుకొని సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. సరస్వతీ దేవాలయాన్ని, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదన్నారు. ఇదే యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలు నేర్పిన జయదీర్ తిరుమలరావు కూడా విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ఆద్య కళ అంటే తమకు గౌరవమేనని, దానికి మేం వ్యతిరేకం కాదు కానీ, దయచేసి యూనివర్సిటీ జోలికి రావద్దని విన్నవించారు. తెలుగు యూనివర్సిటీ పరిరక్షణ సమితి భార్యలో జరిగిన
ఈ కార్యక్రమంలో జర్నలిజం, భాష శాస్త్ర, జ్యోతిష్య విభాగం అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పీహెచ్డీ స్కాలర్లు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page