
ఉలుపాల శేఖర్ రెడ్డి… బిఆర్ఎస్ పార్టీ నాయకులు,మాజీ ఉప సర్పంచ్.
Sekhar Reddy : చింత పల్లి జులై 11, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఉలుపాల శేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామంలోని అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ వివరాలను పరిశీలించి, అవసరమైన దరఖాస్తులను సమర్పించాలని గ్రామ ప్రజలకు కోరారు.
ఓటరు జాబితాలో కొత్త పేర్లు నమోదు చేయడం పేర్లు సవరించడం,చిరునామా మార్పులు,ఇతర అవసరమైన మార్పుల కోసం సంబంధిత బూత్ లెవల్ అధికారి ( బీ ఎల్ ఓ) లేదా ఎన్నికల అధికారులను సంప్రదించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్,సిమర్ల పర్వతాలు,బిఆర్ఎస్ పార్టీ బీ ఎల్ ఏ సిమర్ల శ్రీను యాదవ్,జీపీ ఓ యాదయ్య,బి.యల్.ఓ అంజమ్మ,గ్రామ ప్రజలు సిమర్ల శంకర్, వలమోని వెంకటయ్య,దాసరి వెంకటయ్య,ఐతమోని బిక్షం,బెక్కం సత్తయ్య,తదితరులున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe