Bandi Sanjay : రామయ్య మరణం తెలంగాణకు తీరని లోటు

TRINETHRAM NEWS

గుండెపోటు కారణంగా వనజీవి రామయ్య మృతి

రామయ్య మృతిపై విచారం వ్యక్తం చేసిన బండి సంజయ్

జీవిత కాలంలో కోటికి పైగా మొక్కలు నాటారని కితాబు

Trinethram News : తన జీవితాన్ని మొక్కలు నాటడానికే అంకితం చేసిన వనజీవి రామయ్య గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. తన జీవిత కాలంలో కోటికి పైగా మొక్కలను నాటి, పర్యావరణ పరిరక్షణకు అపారమైన సేవలు అందించారని కొనియాడారు. రామయ్య తన కుటుంబ సభ్యులకు సైతం చెట్ల పేర్లను పెట్టి, పర్యావరణంపై తన ప్రేమను చాటుకున్నారని చెప్పారు.

రామయ్య చేసిన సేవలను గుర్తించిన మోదీ ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని తెలిపారు. ఆయన మరణం తెలంగాణకు, పర్యావరణ సమాజానికి తీరని లోటు అని చెప్పారు. వనజీవి బిరుదుతో ప్రసిద్ధిగాంచిన రామయ్య మరణం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramaiah's death is a

You cannot copy content of this page

Scroll to Top