కానరాని ఉద్యోగులు, వినియోగదారులకు తప్పని ఇబ్బందులు.
పేరుకే మండల కేంద్రం లో బీఎస్ఎన్ఎల్ టవర్, రాని నెట్ వర్క్.
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్12 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ కు తాళం. పేరుకే ఉద్యోగులు ఆఫీసులో కంటి కి కానరాని వైనం. బ్యాకప్ బ్యాటరీలు, జనరేటర్ ఉన్నా , కరెంట్ పోయినపుడు ఆన్ చేయడానికి ఎవరు లేకపోవడంతో, వినియోగ దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజలు వాపోతున్నారు.
సిగ్నల్స్,నెట్వర్క్ లేక ప్రజ ల చరవానులు పనిచేయక ఏమి చేయలేని దీనావస్థలో పట్టణ వాసులు , సాదక భాధలు చెప్పుకోవడానికి ఒకే ఆయుధం చరవాని అది పనిచేయని కారణంగా స్థానికులు మనోవేదనకు గురవుతున్నారు. ఆఫీసులోలోపల చెత్త పేరుకుని పోయి, చుట్టూ చెట్లతో నిండి ఉంది.
ఉద్యోగులు ఆఫీస్ ను చూ సిన పాపన పోలేదు, ఇక్కడ పని చేసేవారు ఎక్కడో ఉండి జీతాలు తీసుకుంటూ తమ కాలం వెళ్లదీస్తున్నారు అని మండల ప్రజలు అనుకుంటున్నారు. ఆఫీస్ లోపల చెత్త ,సామాన్లు ,చిందర వందరగా పడివున్న ఎవరు పట్టించుకో పోవడం గమనార్హం.
ఆఫీస్ లోపల రూంలో. కోతులు ఆవాసాలుగా ఏర్పరుచుకున్న ఆఫీస్ తాళం తీసి చూసే వారే కరువయ్యారని, డిండి లో నెట్ వర్క్ సమస్య, (బీఎస్ఎన్ఎల్) కస్టమర్ కేర్ కు సంప్రదించిన మాకేమీ తెలియదు అక్కడ విధులల్లో,ఎవరున్నారో కూడా తెలవదన్నట్లు , ఎవరున్నారో కూడా సమాచారం తమవద్ద లేనట్లు , దాట వేయు ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
డిండి పట్టణం లో పేరుకేపెద్ద బి ఎస్ ఎన్ఎల్ టవర్, పని చేయని నెట్ వర్క్, చాలా ఏళ్లుగా ప్రజలు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు గా ఉంటూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు , వినియోగదారులకు కొత్తకొత్త ఫీచర్లతో దగ్గర కావాల్సిన పరిస్థితిలో ప్రజలను ఇబ్బంది లేకుండా చూడాల్సింది పోయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అని , ఇప్పటికైనా సంబంధిత బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు స్పందించి ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, వెంటనే బిఎస్ఎన్ ఎల్ టవర్, మరియు ఆఫీస్ ఉద్యోగులు తమ తమ విధుల్లో చేరి, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తారని డిండి మండల ప్రజలు కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


