మున్సిపల్ ఎన్నికల ముందే సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

TRINETHRAM NEWS

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ నివాసంలో మెమొరండం సమర్పించిన మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల కార్మికుల పిల్లలు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ ముందే మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరిస్తాము. ఇటి సమస్య పరిష్కారం కొరకై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇంతకముందే మాట్లాడడం జరిగింది త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపుదామని కూడా మాట్లాడినారు.

కావున సింగరేణి కార్మికులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుంది అని చెప్పినారు. నా మీద ప్రేమ చూపి నన్ను గెలిపించిన మీకు ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరిస్తాను. ఇది నా మాట, మీకు ఉద్యోగాలు తెప్పించే బాధ్యత నాది అని తెలియజేసినారు. అనంతరం మెమరండం సమర్పించిన వారు లక్క శ్రావణ్ గౌడ్, తిరుమల శ్రీనివాస్, రామిళ్ళ సందీప్, పున్నం వెంకటేష్, పర్తపల్లి హరీష్, ఇంజపెళ్లి ఓం ప్రకాష్, సాయికిరణ్, ఈర్ల రాజయ్య, డిష్ బాబు మెమోరాండం ఇచ్చి వారి బాధను తెలియజేసుకున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Makkan Singh Raj

You cannot copy content of this page

Scroll to Top