రామగుండం మండలంలోని ఎన్.టి.పి.సి టౌన్షిప్ లో గల
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు నాసా ఎన్.ఎస్.ఎస్ గెరార్డ్ కె. ఓ’నీల్ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. రెండు టీం లు టీమ్ ఫేనీస్ – 5 మంది విద్యార్థులు మరియు
టీమ్ నెబ్యులా- 8 మంది విద్యార్థులు విజయం సాధించారు. ఇంతటి విజయాన్ని సాధించిన విద్యార్థులను మరియు వారికి ప్రోత్సాహాన్ని అందించినటువంటి నాసా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎస్ వెంకట రమణ, ప్రోగ్రాం ఇంచార్జి- రమేష్ కోడూరి నీ ఏ.జీఎం తిరుపాలు, అకాడమిక్ కో-ఆర్డినేటర్ జయ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ అభినందించారు.
ఫలితాల పట్ల వైస్ ప్రిన్సిపల్ నమ్రత, డీన్ అనిల్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ మరియు అధ్యాపక బృందం ఆనందం వ్యక్తం చేశారు. మునుపటి సంవత్సరం లో ఇద్దరు విద్యార్థినిలు అంజికా రాణా మరియు శ్రేయ దుబే యు.ఎస్.ఎ లోని లాస్‌ఏంజెల్స్ లో ప్రతిష్టాత్మకమైన ఐ.ఎస్.డి సి కాన్ఫరెన్స్ 2024 లో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


