MLA Jare : అర్హులైన నిరుపేదలకు పక్కా గృహాలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జారే

ములకలపల్లి మండలం చాపరలపల్లి గ్రామపంచాయతీని రాష్ట్ర ప్రభుత్వం మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి ఒకే విడతలో అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చటానికి ఇందిరమ్మ గృహాలను నిర్మిస్తున్న తరుణంలో స్థానిక శాసనసభ్యులు
జారె ఆదినారాయణ చేతులమీదుగా శంకుస్థాపన చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.అదేవిధంగా అర్హులైన నిరుపేదలందరికి 5 లక్షలతో పక్కా ఇండ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలుపుతు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో , ఎంపీడీవో, పలుశాఖల అధికారులు కాంగ్రెస్ మండల నాయకులు గ్రామస్తులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare who performed Bhumi Pooja

You cannot copy content of this page

Scroll to Top