సెప్టెంబర్ 21, 2026
TRINETHRAM NEWS
food donation

రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాల్లో పలివెల ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం ఒకటి…

ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నాం…

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు

Food Donation : త్రినేత్రం న్యూస్ : దానాలన్నిటిలోనూ అన్నదానం మహోత్కృష్టమైనదిగా మన పురాణాలు తెలియజేస్తున్నాయని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మన సాంప్రదాయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా సోమవారం ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు అధికారులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధి చెందితే ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పలివెల క్షేత్రం అత్యంత పురాతనమైన క్షేత్రమని, ఈ క్షేత్రంలో ప్రతిరోజు 500 నుంచి 600 మందికి, పర్వదినాల్లో అయితే 2వేల మంది వరకు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహిస్తూ భక్తులకు సేవలందించడం ప్రశంసనీయమన్నారు.

అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు,మురళి, రాంబాబు,రామకృష్ణ, రావూరి వెంకటేశ్వరరావు, తాతాజీ బృందాన్ని, దాతలను ఆయన అభినందించారు. సమాజం బాగుండాలంటే దేవుని ఆశీస్సులు ఉండాలని ఆయన అన్నారు. ఆలయం అభివృద్ధి చెందితే గ్రామం సైతం అభివృద్ధి చెంది స్థానికులకు అనేక ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ఆలయంలో రాజగోపురం నిర్మాణం మొదలయిందన్నారు,కోనేరు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page