అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Parents Sprinkle Sacred Rice

Parents Sprinkle Sacred Rice : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : ఆన్‌లైన్‌లో కూతురు పెళ్లి చూస్తూ తల్లిదండ్రులు అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఘటన సూర్యాపేట(D) హుజూర్‌నగర్(M) వేపలసింగారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతుల కుమార్తె హిమబిందు అమెరికాలో ఉద్యోగం చేస్తోంది.

అక్కడ పరిచయమైన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. శుక్రవారం రాత్రి వీరి వివాహం జరగగా బంధువుల సమక్షంలో తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో వీక్షించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇలాంటి న్యూస్ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page