ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా అవసరం….
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా అవసరమని మండపేట ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మెన్ వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట పట్టణంలో సోమవారం మెప్మా సి ఎం ఎం సుజాత ఆధ్వర్యంలో యోగ ర్యాలీ చేపట్టారు. మునిసిపల్ కార్యాలయం వద్ద ఈ ర్యాలీని ఎమ్మెల్యే వేగుళ్ళ, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలా కృష్ణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోనసత్యనారాయణ లు సంయుక్తంగా ప్రారంభించారు. యోగాతో ఆరోగ్యమే కాదనీ ఆనందం లభిస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ళ చెప్పారు.
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా జూన్ 21న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో యోగంద్రా పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి యోగ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. వేగుళ్ళ లీలా కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని కోరారు. మంచి ఆరోగ్య అలవాటులు ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో మునిసిపల్ ఆర్ ఐ అందె శ్రీనివాస్, టీడీపీ నాయకులు కడియాల వెంకట లక్ష్మి, అర్ పి లు, మునిసిపల్ సిబ్బంది, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


