త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం : రాఖీ పౌర్ణమి వేడుకలు తిలక్ రోడ్డులోని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ఇంట జరిగాయి. తెలుగు మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని ఆయనకు రాఖీలు కట్టి మిఠాయి తినిపించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అలాగే బ్రహ్మ కుమారీలు కూడా ఆయనకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రక్షా బంధన్ అనేది తోబుట్టువుల ప్రేమ, రక్షణను జరుపుకునే హిందూ పండుగని అన్నారు. ఇది ఒక సోదరి తన సోదరుడి మణికట్టుపై ‘‘రాఖీ’’ అనే పవిత్ర దారాన్ని కట్టే సంప్రదాయం ద్వారా ప్రేమ, ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగు మహిళలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


