MLA Nallamilli : కేశవరం రైల్వే ఓవర్ బ్రిడ్జికి లైన్ క్లియర్

TRINETHRAM NEWS

ఫలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి కృషి

త్రినేత్రం న్యూస్, ప్రతినిధి. మండపేట నియోజకవర్గం కేశవరం రైల్వే గేటు దగ్గర ఓవర్ బ్రిడ్జి లేక జిల్లా ప్రజలు యేళ్ళ తరబడి ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ విదితమే. ముఖ్యంగా ఈ రైల్వే గేటు మార్గం అనపర్తి నియోజకవర్గానికి అత్యంత కీలకం. వందలాది మంది అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఈ దారి గుండా రాజమండ్రి తదితర ప్రాంతాలకు పయనిస్తుంటారు.

ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల డిల్లీ వెళ్ళి వివిధ అభివృద్ది పనుల నిమిత్తం కేంద్రమంత్రులను కలసినపుడు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి అంశం గురించి కూడా మంత్రులతో మాట్లాడటం జరిగింది. తన నియోజకవర్గ పరిధి కాకపోయినా అనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎక్కువ ఉపయోగకరమైన పని కావడంతో మండపేట, ఎమ్మెల్యే, వేగుళ్ళ జోగేశ్వరరావు అనుమతితో నాడు కేంద్రమంత్రులతోను ఆ తర్వాత జిల్లాకు వచ్చిన రైల్వే అధికారులతో సమావేశంలోను ఎంపీ పురంధేశ్వరి,తో కలసి ఈ ఓవర్ బ్రిడ్జి ఆవశ్యకతను వివరించారు నల్లమిల్లి.

వీరి కృషితో ఈ కేశవరం ఓవర్ బ్రిడ్జికి మోక్షం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల రైల్వేశాఖ రామచంద్రపురం ఆర్ డి ఓ కి భూసేకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇపుడున్న గేటు వద్ద కాకుండా కడియం వైపు వరిభూములను వంతెనకు సరిపడా సేకరించాల్సిందిగా వాటికి సంబంధించిన వివరాలను పేర్కొంటూ వెల్లడించింది.

407 వ కిలోమీటరు వద్ద రాకుండా 409 వ కిలోమీటరు వద్ద వంతెన నిర్మాణానికి పొలాలను సేకరించవలసిందిగా ఆర్ డి ఓ కి ఇచ్చిన ఉత్తర్వులలో రైల్వేశాఖ పేర్కొంది.

ఈ క్రమంలో యేళ్ళ తరబడి ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లైంది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటంతో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎమ్మెల్యే, నల్లమిల్లి అటు కెనాల్ రోడ్డు సమస్యకు ఇటు కేశవరం రైల్వే గేటు సమస్యకు పరిష్కారం కోసం కృషిచేయడం ఎంతైనా అభినందనీయం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Line clear for Kesavaram

You cannot copy content of this page

Scroll to Top