Rajiv Gandhi’s Death Anniversary : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

TRINETHRAM NEWS

టేకుమట్ల మండలం మే-21// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. టేకుమట్ల మండలంలో పార్టీ కార్యాలయంలో భారత 6వ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వైనాల రవీందర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రధానిగా ఉండి అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈ దేశానికి మొదటగా టెలికాం రంగంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటరికరణను ఈ దేశానికి పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీ.

అలాగే 18 సంవత్సరాల యువతకు ఓటు హక్కు కల్పించారు. అలాగే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లతో పాటు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను సమకూర్చి జవహర్ రొజ్ పథకం ద్వారా అభివృద్ధి చేశారు. రాజీవ్ గాంధీ భారతదేశ సమాచార విప్లవ పితామహుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి శాస్త్రాల కిరణ్, టౌన్ అధ్యక్షులు పెరుమాండ్ల క్రాంతి, మండల నాయకులు కోరె చందు, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వైనాల యశ్వంత్, వెంకటేశ్వర్లు,బోనగిరి తిరుపతి, చిలుక కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajiv Gandhi's death anniversary

You cannot copy content of this page

Scroll to Top