
Rainfall Due to El Nino త్రినేత్రం న్యూస్ : నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం! — సాధారణ వర్షం కంటే తక్కువగా 92 శాతం నమోదయ్యే అవకాశం . –తూర్పు గాలులతో ఉత్తరాంధ్రకు డోకా లేదు . భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ముఖ్యంగా రైతాంగం నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల వర్షాలపై ఆధారపడి పంటలు వేస్తారు. అయితే ఈ పరిస్థితికి భిన్నంగా వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం 2026 సంవత్సరంలో ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షాలు పడనున్నాయి.ఏడాది మొత్తం సగటున వర్షపాతం కంటే లోటుతో 92 నుంచి 94 శాతం లోపే ఉంటుందని వాతావరణ అధ్యయన సంస్థల అంచనా . పసిఫిక్ మహాసముద్రంలో మధ్య-తూర్పు భాగంలో సముద్రపు నీరు పై భాగంలో సాధారణం కంటే ఎక్కువ వేడెక్కడం నమోదయింది.
అన్ని సముద్రాలు కన్నా పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్దది. భూమధ్య రేఖకు 30 డిగ్రీల పై భాగంలో ఏర్పడేటువంటి పరస్పర చర్యలు ఇతర సముద్రాలపై ప్రభావం ఉంటుంది. తూర్పు దిశ నుండి పడమటి దిశగా గాలివాటం ఉంటుంది. గాలులు బలహీనమైనప్పుడు, గాలి దిశ మార్చుకుంటుంది. హిందూ సముద్రంలో అధిక పీఠం ఉంటుంది. అధిక పీడనం నుంచి అల్పపీడనం కలిగినటువంటి ప్రాంతాల్లో అధిక వర్షపాతానికి అవకాశం ఉంటుంది.
అల్పపీడనం బలహీన పడితే వేడి తగ్గి ఎలినో అధిక పీడనాన్ని ఎక్కువ ఆకర్షిస్తుంది. దీంతో ఎల్ నినో ప్రభావంతో ఎక్కువ ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి . ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా భారతదేశానికి ప్రకృతి సహజసిద్ధంగా నీటికి వరంలా ఉండే నైరుతి , ఈశాన్య రుతుపవనాలు ఎల్ లినో దెబ్బకు బలహీనపడే అవకాశా లు ఉన్నాయి. 2026 ఏడాది నైరుతి రుతుపవనాల రాక సందర్భంలోనే ఎల్ లినో ప్రభావం సమాంతరంగా కొనసాగుతుంది. మే మాసం నుంచి జూలై మాసం మధ్య లో ఎలినో ప్రభావం ప్రారంభమైనప్పటికీ, ఏడాది చివరి నాటికి ఎల్ లినో బలంగా ఒక దశలో సూపర్ ఎల్ లినోగా ( మరింత బలంగా) మారే అవకాశాలు దాదాపు 66 శాతం స్పష్టంగా ఉన్నాయి.
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 0.5 శాతం అధికంగా నమోదవుతున్నాయి. 1950 నుండి ఇప్పటివరకు గడిచిన 76 సంవత్సరాల కాలంలో దాదాపు 16 సార్లు ఎల్ లినో ప్రభావం నమోదైనప్పటికీ తొమ్మిది సార్లు మాత్రమే ప్రతికూల పరిస్థితి ప్రభావాలు చూపింది. 2009 లో బలహీనమైన ఎల్ లినో ప్రభావం ఉన్నప్పటికీ ఆ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువగా 78.2 శాతం వర్షపాతం నమోదైంది. దాదాపు 37 సంవత్సరాల లో అతి తక్కువగా ఆ ఏడాది వర్షం నమోదు అయింది. 2026లో ఎల్ లినో ప్రభావం బలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది . దేశంలో లోటు వర్షపాతం ఉత్తర, మధ్య, పశ్చిమ భారత ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఇండోర్, గ్వాలియర్, గుజరాత్, మహారాష్ట్రలో సాధారణ కంటే అతి తక్కువ వర్షాలు నమోదు అవుతాయి.
ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రాయలసీమ ప్రాంతంలో కొంత లోటు వర్షపాతం ఉన్నప్పటికీ, కోస్తాంధ్ర,ఉత్తరాంధ్రకు తూర్పు గాలుల ప్రభావంతో లోటు వర్షం లేకుండా, సాధారణ వర్షాలు కంటే అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ లో ప్రవేశించాయి. ఈసారి అతి త్వరగా ఈ నెల 26న దేశంలో కేరళ రాష్ట్రాన్ని సాధారణం కంటే వారం ముందుగా… వరుసగా మూడవ ఏడాది కూడా ముందస్తుగానే నైరుతి రుతుపవనాల ఆగమనం జరుగుతోంది.దేశంలో దాదాపు 50% పైగా రైతాంగం వర్షాధారిత వ్యవసాయo పై ఆధారపడతారు. రైతులు ఈ ఏడాది ఎల్ లినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని నీరు ఎక్కువ అవసరమయ్యే పంటలు వేయకపోవడం మంచిది. ఖరీఫ్ సీజన్లో వేసే పంటలు వరి,పత్తి,పప్పు ధాన్యాలు వేయడం వలన దిగుబడి తగ్గుదలకు అవకాశం ఉంది.
” ఉత్తరాంధ్రలో వర్షానికి డోకా లేదు ఈ ఏడాది ఎల్ లినో ప్రతికూల ప్రభావంతో దేశంలో రాష్ట్రంలో వర్షాలు పరిస్థితి ఎలా ఉన్నా, తూర్పు గాలుల పుణ్యమా అని ఉత్తరాంధ్రలో సాధారణ వర్షాల కంటే ఒక మోస్తారు ఎక్కువ వర్షాలు నమోదుకు అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు నైరుతి రుతుపవనాల సమయంలో ఏర్పడడం వల్ల వాయుగుండం నేరుగా ఉత్తరాంధ్ర తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉత్తరాంధ్రలో మెండుగా వర్షానికి అవకాశం ఉంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
చరిత్రలో 2015 నాటి సూపర్ ఏలినో ప్రభావం తో తీవ్ర లోటు వర్షం దేశంలో నమోదైనప్పటికీ , ఆనాడు తూర్పు గాలుల పుణ్యమా అని ఉత్తరాంధ్రలో లోటు లేకుండా సాధారణ వర్షాలే నమోదు కాబడింది. ఉత్తరాంధ్రలో జూన్ మొదటి వారం తర్వాత రెండో వారం లోపల నైరుతి రుతుపవనాలు ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు ప్రారంమవుతాయి. జూలై నుండి అల్పపీడనాలు,వాయుగుండం ప్రభావంతో ఈఏడాది సాధారణంగా అంటే ఎక్కువ భారీ వర్షాలకు సూచనలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో సగటున 1100 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాల్సి ఉంది. సాధారణంగా అదనంగా వర్షాలు పడం వల్ల 1200 మిల్లీమీటర్లుగా నమోదు కాబడి, నీటికి లోటు లేని పరిస్థితి ఉంటుంది.
జూన్ 15వ తేదీ తర్వాత ఉత్తరాంధ్రలో నాట్లు వేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే పంటలు మంచిదని, మెట్ట ప్రాంతాల్లో చెరుకు, పసుపు మొక్కజొన్న పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని తెలిపారు. ఉత్తరాంధ్ర రైతాంగానికి ఖరీఫ్ సీజన్లో నీటికి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ, రబీ సీజన్లో తేమ శాతం తగ్గి పంటలు దిగుబడి తక్కువ నమోదు అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఎలినో ప్రభావంతో ఈ ఏడాదికి ఉత్తరాంధ్రలో కరువు ఏర్పడే అవకాశాలు లేవు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

