MLA Bathula : దేశ శ్రేయస్సు కోసం శ్రీకాళహస్తి లో రాహు కేతు పూజ

TRINETHRAM NEWS

జయహో భారత్… భారత్ మాతాకీ జై

శ్రీ కాళహస్తి శ్రీ కాలహస్తీస్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం:త్రినేత్రం న్యూస్ : జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుత నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో…… గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ,కి, మన సైనికులకు, మన దేశ ప్రజలు సౌభాగ్యంగా ఉండాలని, దైవ బలం మెండుగా సిద్ధించాలని దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించి ప్రార్ధన చేయాలని *గౌరవ ఉప ముఖ్యమంత్రి , జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపులో భాగంగా… గౌరవ రాజానగరం శాసనసభ్యులు, బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి , 150 మంది జన శ్రేణులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి అందరికీ దైవ బలం, సంకల్ప సిద్ధి సిద్ధించాలని దేశ శ్రేయస్సు కోసం శ్రీకాళహస్తి లో రాహు కేతు పూజ నిర్వహించారు..అనంతరం వేద పండితులు స్వామి వారి చిత్రపఠాన్ని, ప్రసాదం అందజేయడం జరిగింది..

దర్శనం అనంతరం దేవాలయం బయటికి వచ్చి జాతీయ జెండా పట్టుకుని జయహో భారత్… భారత్ మాతాకీ జై అని నినదించడం జరిగింది..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాట్లాడుతూ భారత్, పాకిస్తాను యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని, దేశ త్రివిధ దళాలకు దైవ శక్తి ఉండాలని, సంకల్ప సిద్ధి, మన దేశ నాయకత్వానికి జయం కలగాలని ఆకాంక్షిస్తూ….. జనసేన పార్టీ అద్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కల్యాణ్, పిలుపు మేరకు *”జయహో భారత్ విజయ యాత్ర” ప్రారంభించడం జరిగిందని… అందులో భాగంగా నేడు శ్రీ కాళహస్తి శ్రీ కాలహస్తీస్వర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు..మన దేశం ఆర్థికంగా, సైనిక శక్తిగా దృఢంగా ఉన్నా దేవుడి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలనే ఉద్దేశ్యంతో మా అధ్యక్షులు , పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ పుణ్య క్షేత్రాల్లో పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఉద్రిక్త వాతావరణం మధ్య విధులు నిర్వహిస్తున్న సైనికులకు అండగా యావత్ దేశ ప్రజలు అందరూ అండగా ఉన్నామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rahu Ketu Puja in

You cannot copy content of this page

Scroll to Top