Rahman Foundation : ఎల్లాపటార్ ప్రభుత్వ పాఠశాల వేదిక (STAGE) కోసం రెహమాన్ ఫౌండేషన్ ఆర్థిక సాయం అందజేత

TRINETHRAM NEWS

విద్యార్థులు భవిష్యత్తు కోసం రెహమాన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుంది — షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ (రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్)

Trinethram News : లింగాపూర్: లింగాపూర్ మండలంలోని ఎల్లాపటార్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వేదిక (STAGE) కోసం విషయం తెలిసిన వెంటనే, అదే గ్రామానికి చెందిన, అదే పాఠశాలలో చిన్ననాటి విద్యను పొందిన రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఉదాత్తమైన సేవా భావాన్ని చాటుకున్నారు. పాఠశాల వేదిక (STAGE) పనుల కోసం రూ. 10,000/- సాయాన్ని స్వయంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆడే ఉత్తమ్, ఆడే గోపాల్, నవీన్, దయాకర్, రాథోడ్ వినోద్ గారికి అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది చైర్మన్ ని మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు. పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు, తల్లిదండ్రులు డాక్టర్ జిలాని కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని మాట్లాడుతూ — విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తి కావాలన్నారు. విద్య అనేది సమాజాన్ని వెలిగించే దీపం — ఆ దీపం ఎప్పటికీ ఆరిపోకుండా కాపాడటమే మా ఫౌండేషన్ ధ్యేయమని, పిల్లల చిరునవ్వే మాకు నిజమైన బహుమానమని, పాఠశాలలు బలపడితేనే విద్యార్థుల భవిష్యత్తు బలపడుతుందన్నారు. సేవ చేసే చేతులు ప్రార్థించే చేతులకంటే గొప్పవి — అలాంటి చేతుల సంఖ్య పెరగాలని చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ ఆకాంక్షించారు!!

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rahman Foundation provides financial assistance

You cannot copy content of this page

Scroll to Top