Rahman Foundation : లింగాపూర్ ఎస్‌.ఐ. ని మర్యాదపూర్వకంగా కలిసిన రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్

TRINETHRAM NEWS

Trinethram News : పోలీసులు – ప్రజలు కలిసిమెలిసి శాంతి స్థాపనలో భాగస్వాములు కావాలి — షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ (రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్)

లింగాపూర్: లింగాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌.ఐ. గంగన్న ని రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని మర్యాదపూర్వకంగా కలిసి, గౌరవ సూచకంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పోలీసు వ్యవస్థ ప్రజలతో కలిసిమెలిసి శాంతి భద్రతలను కాపాడే విధంగా వ్యవహరించాలని చైర్మన్ సూచించారు. మండలంలో శాంతియుత వాతావరణం నెలకొనడానికి పోలీసులు, ప్రజలు పరస్పర విశ్వాసంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రజల సమస్యలను తమవిగా భావించి పరిష్కరించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, సమాజంలో న్యాయస్ఫూర్తి, ఐకమత్యం బలపడతాయని చెప్పారు.

అలాగే, రెహమాన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ శాంతి, సామాజిక ఐకమత్యం, ప్రజా సేవల కోసం ముందుండి పనిచేస్తుందని చైర్మన్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని తెలిపారు. సమాజంలో సుస్థిర శాంతి నెలకొనేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెహమాన్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యనిర్వాహకులు మహమ్మద్ జబ్బార్ సాబ్, ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్, చప్డే మారుతి, షేక్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chairman of Rahman Foundation

You cannot copy content of this page

Scroll to Top