18,19 డివిజన్లలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల…
త్రినేత్రం న్యూస్, జనవరి 30, నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. 18,19 డివిజన్లలో 8 లక్షల రూపాయలు కార్పొరేషన్ నిధులతో జరుగుతున్న మ్యాన్ హోల్స్, కల్వర్టు పనులను ఎమ్మెల్యే గోరంట్ల పరిశీలించారు.
ఆసందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చేసే పనిలో క్వాలిటీ ముఖ్యమని మ్యాన్ హోల్స్ ను పరిశీలిస్తే మంచి క్వాలిటీగా పనులు చేస్తున్నారని అన్నారు.
వార్డులో ఉన్న సచివాలయాన్ని, స్కూలు తనిఖీ చేశారు. మరికొన్ని సమస్యలను స్వయంగా పరిశీలించి పనులు చేసేందుకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండురి అప్పారావు, వాసిరెడ్డి బాబి, గొందేసి హరినాథ్, కక్కల రమేష్, బొంతు ప్రసాద్, చిట్టిబోయిన శ్రీనివాస్, పీత వంశీ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


