త్రినేత్రం న్యూస్, జనవరి 30, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన సందర్భంగా రామచంద్రాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ శ్రీ పిల్లి సూర్యప్రకాశ్,ని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ, రామచంద్రాపురంలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆమె పిల్లి సూర్యప్రకాశ్, కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు. పార్టీని ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వెంకట రెడ్డి, హనుమాన్, సత్యం కాపు, సాధనాల శ్రీను, నిమ్మకాయల దుర్గా, ఎనుముల అక్కబాబు, చిక్కం సీతారాముడు, మచ్చ లోవరాజు,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


