త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు దమ్మపేట మండలం పట్వారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నూతన విద్యా విధానం (NEP-2020)కు అనుగుణంగా బోధనా విధానాల్లో మార్పులు, మౌలిక విద్యార్హతలపై దృష్టి, విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర, టెక్నాలజీ ఆధారిత బోధన పద్ధతుల అవగాహన.ఈ శిక్షణలో మండల ఎంఈఓ కీసర లక్ష్మి తో పాటు వివిధ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు పునరావృతం కావాలని ఎంఎల్ఏ సూచించారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


