MLA Jare : చ్చిరొట్ట విత్తనాల పంపిణీతో రైతు సంక్షేమానికి మరో మెట్టు ఎమ్మెల్యే జారె

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. అశ్వారావుపేట, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రైతన్నల భూసారం పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది ఈ క్రమంలో దమ్మపేట మండల కేంద్రంలో విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని విత్తనాలను స్వయంగా రైతులకు అందజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు మద్దతుగా నిలవాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘం చైర్మన్ ఎల్లిన రాఘవరావు,వైస్ చైర్మన్ కట్టం ఎర్రప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, సొసైటీ డైరెక్టర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another step towards farmer

You cannot copy content of this page

Scroll to Top