
నిండు జీవితానికి రెండు చుక్కలు
Pulse Polio : దేవరకొండ జూన్ 28, త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు ఉదయం 9 గంటలకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధ్యక్షుడు ఎన్ వి టీ,10 వ వార్డు కౌన్సిలర్ మాధవి సత్యం సభ్యులతో కలిసి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలు ఎంతో అవసరమని, పల్స్ పోలియో అనేది పోలియో వైరస్‌కు వ్యతిరేకంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ టీకాలు వేయడం ద్వారా భారతదేశంలో పోలియోమైలిటిస్ (పోలియో) ను తొలగించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోగనిరోధక ప్రచారం అని అన్నారు.
ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. నూట పదిమంది వరకు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్ , డా ప్రజ్ఞ సాగర్, కే పంతులాల్, భాస్కర్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ ఉమేష్ ,తాళ్ల సురేష్ ,సముద్రాల వెంకన్న, మాకం మహేష్, కౌన్సిలర్ సాయి చంద్ర గౌడ్ ,జగదీశ్వర చారి , జి సత్యం ,కరాటే మాస్టర్ గోపి, శ్రీను యాదవ్, నాగరాజు, బాలు, అఖిల్, జీవన్, రాములు ,మెడికల్ సిబ్బంది లింగయ్య, వినోద, సునీత ,బత్తుల సురేష్, రహీం, శివ ,రాము, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe