
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం .
Foundation Stone : దేవరకొండ డివిజన్ జూన్ 28, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని 11, 12 వార్డుల్లో నగరాభివృద్ధి నిధుల కింద “రూ.1 కోటి 42 లక్షల 25 వేల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు నాణ్యమైన రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe